Site icon NTV Telugu

AP Pensions: మరో వృద్ధుడి ప్రాణాలు తీసిన పెన్షన్‌..!

Ap Crime

Ap Crime

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు రావడం ఏమో గానీ.. పెన్షన్ల కోసం వెళ్లి వృద్ధులు ప్రాణాలు వదిలేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. గత నెలలో పెన్షన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి.. ఎండలో పడిగాపులు కాసి కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటే.. ఇప్పుడు.. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసినా.. మరికొందరు ప్రాణాలు పోతున్నాయి.. గత మూడు రోజుల నుంచి డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది ప్రభుత్వం.. మిగిలిపోయిన వారికి ఇవాళ, రేపు నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్‌ అందించనున్నారు. అయితే, బ్యాంకులో జమ చేసిన సొమ్ము కోసం వెళ్లి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొందరి ప్రాణాలు పోగా.. తాజాగాజజ పెన్షన్ కోసం వెళ్లి మరో వృద్ధుడు మృతి చెందాడు.. కడప జిల్లా బద్వేల్ పట్టణం అమ్మవారిశాలకు చెందిన వల్లంకొండు రామయ్య.. శుక్రవారం రాత్రి కన్నుమూశాడు.. పెన్షన్ కోసం బ్యాంక్ చుట్టు రెండురోజులు తిరిగాడు రామయ్య.. అయితే, ఆధార్ లింక్ కాకపోవడంతో నగదు డ్రా చేసుకోలేక పోయాడు.. కానీ, తీవ్రమైన ఎండ తాకిడి తట్టుకోలేక వడదెబ్బ కొట్టింది రామయ్యకు.. దీంతో.. రాత్రి రామయ్య మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read Also: Rahul Gandhi: రాయ్‌బరేలీలో పోటీ చేయడంపై వయనాడ్‌ ప్రజలు ఏమంటున్నారంటే..!

Exit mobile version