Site icon NTV Telugu

Pennsylvania: యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు..!

Pennsylvania

Pennsylvania

Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లింకన్ యూనివర్సిటీ శనివారం రాత్రి కాల్పులతో దద్దరిల్లింది. చారిత్రక నల్లజాతి విద్యాసంస్థ (HBCU) అయిన ఈ యూనివర్సిటీలో హోమ్‌కమింగ్ వేడుకలు జరుగుతున్న సమయంలో బహిరంగ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై చెస్టర్ కౌంటీ జిల్లా అటార్నీ క్రిస్టోఫర్ డి బారెనా సరోబ్ ఆదివారం తెల్లవారుజామున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తుపాకీ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది షూటర్లు పాల్గొన్నారా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం క్యాంపస్‌కు ఎటువంటి ముప్పు లేదని వారు స్పష్టం చేశారు. ఇకపోతే.. ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఏం జరిగిందనే దానిపై మాకు పూర్తి సమాధానాలు లేవని అటార్నీ తెలిపారు. ఏదేమైనప్పటికీ.. కాలేజీ క్యాంపస్‌లో భారీ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా లోపలికి వచ్చారనే కోణంలో మేము విచారణ చేయడం లేదని ఆయన అన్నారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఫిలడెల్ఫియాకు నైరుతి దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Pangong Lake Bunkers: డ్రాగన్ వక్ర బుద్ధి.. భారత్ సరిహద్దులో చైనా కొత్త బంకర్లు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాల్పులు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ అనే భవనం వెలుపల జరిగాయి. అక్కడ పగటిపూట జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసేందుకు సామాజిక కార్యక్రమాల కోసం టెంట్లు, టేబుళ్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ ఘటనతో ప్రజలు అన్ని దిక్కులకు పారిపోయారని జిల్లా అటార్నీ వివరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో లేదా ఇతర సమాచారం తెలిసిన వారు ఎవరైనా ఎఫ్‌బీఐని సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారి పరిస్థితి, వారు చికిత్స పొందుతున్న ప్రాంతాల గురించి అధికారులు వివరాలు వెల్లడించలేదు.

Cyclone Alert: ‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్.. వైద్య ఆరోగ్య శాఖ వ్యాధుల నియంత్రణకు మూడు అంచెల వ్యూహం..!

Exit mobile version