Site icon NTV Telugu

Hyderabad: స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ. 150 కోట్లు స్వాహా..!

Crime

Crime

హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 150 కోట్ల రూపాయలను కొట్టేశారు.. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సంస్థ కుచ్చు టోపీ పెట్టింది.. సెక్యూరిటీ బాండ్ల రూపంలో లాభాలు ఇస్తామని చెప్పి 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు మోసగాళ్లు.. కాగా.. సెక్యూరిటీ సంస్థను ఇద్దరు దంపతులు నడుపుతున్నారు.. కొంతకాలం పాటు కొందరికి లాభాలు సైతం ఇచ్చారు. ఈ లాభాలను చూసి చాలామంది పెంగ్విన్ సంస్థను నమ్మి పెట్టు బడులు పెట్టారు.. జీడిమెట్ల గణేష్ నగర్ కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట ప్రాంతంలోని చాలామంది వ్యాపారస్థులు ఇందులో పెట్టుబడులు పెట్టారు. దాదాపు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఈ సంస్థ దుకాణం ఎత్తివేసింది.. సంస్థ తమను మోసం చేసిందని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.. సంస్థ బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు..

READ MORE: MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..

Exit mobile version