Site icon NTV Telugu

Cardiac Arrest: పీచే దేఖో పీచే.. మీమ్‌తో వైరల్ అయిన అహ్మద్ షా తమ్ముడికి గుండెపోటు..

Ahmad Shah

Ahmad Shah

పిచే దేఖో పీచే.. అనే మీమ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తానీ బాలుడు అహ్మద్ షా ఇంట్లో విషాదం నెలకొంది. గత సంవత్సరం తన సోదరిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అహ్మద్ తమ్ముడు ఉమర్ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. తన అందమైన చూపులు, మాట్లాడే శైలితో లక్షలాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపిన పాకిస్తాన్ ప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్ అహ్మద్ షా.

Also Read:Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్

బాలనటుడు అహ్మద్ స్వయంగా తన తమ్ముడు ఉమర్ షా మరణ వార్తను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో పంచుకున్నాడు. దీనిని ఎవరూ నమ్మలేకపోతున్నారు. అహ్మద్ షా లాగే, అతని సోదరుడు ఉమర్ కూడా చిన్న వయసులోనే సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయ్యాడు. అహ్మద్ షా తన సోషల్ మీడియా ఖాతాలో ఉమర్ కు సంబంధించిన రెండు ఫొటోలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్తాన్‌కు చెందిన అహ్మద్ షా ఇంట్లో జరిగిన రెండవ పెద్ద విషాదం ఇది. 2023 సంవత్సరం ప్రారంభంలో, అతను తన చెల్లెలు ఆయేషాను ఆరోగ్య సమస్యల కారణంగా కోల్పోయాడు. ఉమర్ మరణం అతని కుటుంబాన్ని మాత్రమే కాకుండా అతని అభిమానులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Exit mobile version