Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy : గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇవాళ ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని, ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని, వైసీపీ విజయానికి మనమంతా కృషి చేయాలన్నారు.

ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్‌ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి.

ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్‌ కుమార్‌ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Exit mobile version