Site icon NTV Telugu

Enugala Peddireddy: మనోభావాలు దెబ్బతిన్నాయి.. బీఆర్‌ఎస్‌ కు పెద్దిరెడ్డి రాజీనామా..!

Inugala Adobhatla

Inugala Adobhatla

Enugala Peddireddy: బీఆర్‌ఎస్‌ కు ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గౌరవనీయులైన భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానని లేఖ రాశారు. రాజీనామా లేఖను తమ అనుచరులతో తెలంగాణ భవన్ కు పంపించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ పంపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలి అని మీరు ఆహ్వానిస్తే జులై 27.. 2021 రోజున మీ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని వివరించారు. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మీరు నిర్ణయించిన పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానని వెల్లడించారు.

Read also: New Scorpion : ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు.. కొత్త జాతి విషపు తేలును చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్, హుజురాబాద్ రెండు నియోజకవర్గాల ఇచ్చార్థిగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశానని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మరియు రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం కలిగిన నాకు సముచిత గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా ఉన్న పార్టీ అధిష్టాన వ్యవహార శైలి నచ్చక, పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. దాదాపు 30 నెలల పాటు పార్టీలో పని చేసినప్పుడు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!

Exit mobile version