NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: పిల్లలు కాలేజీలు మానేసి.. పంట పొలాలకు వెళ్తున్నారు!

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

ఎన్నో ఆశలు పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకు వచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ చేశారని.. ఇప్పుడు పిల్లలు కాలేజీలు మానేసి పంట పొలాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ పోరు కొనసాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేస్తోందని, దీనికి పర్యవసానం చెల్లించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు. మారుతి నగర్లో వైసీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆవిష్కరించారు.

‘వైసీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకువచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ చేశారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పిల్లలు అందరూ కాలేజీలు నిపిలిపి వేసి పంట పొలాలకు వెళ్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు కొనసాగిస్తున్నాము. యువతకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు, ప్రతి విద్యార్థికి పది నెలల్లో ముప్పై వేలు ఇవ్వాలి. మహిళా సంఘాల అకౌంట్స్ 50 శాతం నిర్వీర్యం అయిపోయాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేస్తోంది. దీనికి పర్యవసానం చెల్లించక తప్పదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’ అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.