Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy : రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్

Peddireddy

Peddireddy

కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదని, జగన్ ను నన్ను విమర్శించేది పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ మాడా అని మాట్లాడారని, చంద్రబాబు రాయలసీమ నుండి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాయలసీమ లో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పం లో ఓడిపోతాను అని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని, అందుకే తిట్ల పురాణం కు తెర తీశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

అంతేకాకుండా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పం కు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పం కు నీరు అందిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హంద్రీనీవా పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబు కు బాధగా ఉందని, అందుకే పూర్తి కలేదు అని విమర్శలు చేస్తున్నారన్నారు. మాపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే ఓట్లు రూపంలో మీ అందరికీ బుద్ది చెపుతారన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Exit mobile version