విద్యుత్ పంపిణీ సంస్థలు అధికారులతో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, డిస్కం సిఎండిలు జె.పద్మాజనార్థన్ రెడ్డి, కె.సంతోషరావు, హెచ్ హరనాథ్ రావు పాల్గొన్నారు.డిస్కం సిఎండిలు డివిజన్ స్థాయిలో పర్యటించాలన్నారు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
గ్రౌండ్ లెవల్ లో విద్యుత్ వినియోగం, సరఫరాపై సమీక్షించుకోవాలన్నారు. డిస్కంల పనితీరును మరింత మెరుగు పరచాలి. రైతులకు విద్యుత్ ను ఇచ్చే ట్రాన్స్ ఫార్మర్‌లు కాలిపోతే తక్షణం స్పందించాలి. ట్రాన్స్ ఫార్మర్ లు రీప్లేస్ చేసే సందర్భంలో అధిక జాప్యం వల్ల రైతులు పంట నష్ట పోతారు. వారం రోజుల్లో కాలిపోయిన వాటి స్థానంలో పని చేసేవి ఏర్పాటు చేయాలి. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాన్స్ ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
జగనన్న కాలనీలకు విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టిపెడతాం అన్నారు. ఫేజ్ -1 కింద 10,067 లే అవుట్లకు విద్యుత్ ఇస్తాం. 14.80 లక్షల ప్లాట్ లకు రూ.4500 కోట్లతో విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. పనుల విషయంలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పై మంత్రి పెద్దిరెడ్డికి వివరించారు అధికారులు. ఆర్డిఎస్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా 2023 డిసెంబర్ నాటికి 46.41 లక్షల మీటర్లు బిగించాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల మీటర్లను బిగించటం లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.
Read Also: Water Problem: కర్నూలు పల్లెల్లో దాహం….దాహం
