Peddi Ticket Prices Hike: ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
- 'పెద్ది' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు
- జూన్ 3 రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్
- ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్ఠంగా రూ.600గా నిర్ణయించారు.
- సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా
- మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ.125 వరకు పెంపు
- సాధారణ 4 షోల స్థానంలో రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Ticket Prices Hike: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi) విడుదలకు ముందే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు అదనపు షోలకు కూడా అనుమతి మంజూరు చేసింది. దీంతో అభిమానులు తొలి రోజే సినిమాను చూసేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ ప్రీమియర్ షో కోసం టికెట్ ధరను గరిష్ఠంగా రూ.600గా నిర్ణయించింది. దీంతో విడుదలకు ముందే అభిమానులు సినిమాను వీక్షించే అవకాశం లభించనుంది.
జూన్ 4న సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.125 వరకు పెంపు చేసుకునే అవకాశం కల్పించారు. సాధారణంగా 4 షోలు ప్రదర్శించే థియేటర్లకు ఈసారి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ‘పెద్ది’ సినిమా కోసం రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో తొలి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో షోలు ప్రదర్శించనున్నారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
ఇప్పటికే ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి లభించడంతో.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ నమోదు చేయనుంది.

తాజావార్తలు
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!