Peddi Sudarshan Reddy : తాజాగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన స్వంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సిఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని ఆయన అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అంటూనే.. మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా…? అంటూ ప్రశ్నించారు.
Vinay Bhasker: ఆజాం జాహి మిల్లును మూసింది కాంగ్రెస్ ప్రభుత్వమే..దాస్యం కీలక వ్యాఖ్యలు
కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారని., ఆయనపై స్వంత పార్టీలో ధిక్కారం పెరిగి పోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకోవడం కోసం బిఆర్ఎస్ ఎంఎల్ఏ లను గుంజుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందిని., గంటకో హత్య జరుగుతుందంటూ.. రాష్ట్రంలో పాలన పట్టు తప్పిందంటూ ఆయన తెలిపారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం..