Jagapati Babu: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరంగా ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈసారి ఊహించని మేకోవర్‌తో షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో అప్పలసూరి పాత్ర అత్యంత పవర్‌ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది.
READ ALSO: Somaliland Recognition: 30 ఏళ్లుగా గుర్తింపునకు నోచుకొని దేశం.. కానీ ఫస్ట్ టైం!
బోమన్ ఇరానీ, కూడా ‘పెద్ది’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ (హీరోయిన్), శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికీరి చికీరి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన ఈ సినిమా మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
READ ALSO: Sarvam Maya: మలయాళ బ్లాక్ బస్టర్లో అదరగొట్టిన స్టార్ ప్రొడ్యూసర్ కూతురు
