Site icon NTV Telugu

Peddha Kapu 1 : ఓటీటీ లోకి వచ్చేసిన పెదకాపు 1.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 10 27 At 11.34.45 Am

Whatsapp Image 2023 10 27 At 11.34.45 Am

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ పక్కా యాక్షన్ మూవీ పెదకాపు 1.. ఈ సినిమా లో విరాట్ కర్ణ, ప్రగతి ప్రధాన పాత్ర లలో నటించారు..ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సినిమా ఓటీటీ లో కి వచ్చింది. అయితే సెప్టెంబర్ 29న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.బాక్సాఫీస్ దగ్గర పెదకాపు 1 సినిమా బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా ను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించాడు. ఇక సినిమా కు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. రూరల్ బ్యాక్ డ్రాప్‍తో తెరకెక్కిన పెదకాపు 1 సినిమాలో బ్రిగిడ సాగ హీరోయిన్‍ గా నటించింది..ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

అంతేకాకుండా ఇందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విలన్‍ గా నటించడం గమనార్హం..ఈ సినిమాకు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన అభిమానులు.. సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేసారు.. సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ సినిమా అడ్డాల వారి గునపం అని ఓ నెటిజెన్ కామెంట్ చేసాడు… అసలు సినిమాలో ఎమోషనే లేదని,అస్సలు ఏమాత్రం బాగా లేదని సదరు యూజర్ స్పష్టం చేశాడు.ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. అయితే తొలి పార్టే తీవ్రంగా నిరాశపరచడంతో సీక్వల్ తెరకేక్కిస్తారో లేదో చూడాలి… గతంలో శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు నారప్ప లాంటి సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడిలాంటి సినిమా తీయడమేంటన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

Exit mobile version