NTV Telugu Site icon

Peach Health Benefits: ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే ఫ్రూట్ ఇదే.. ఈరోజే ఆహారంలో చేర్చుకోండి!

Peach Fruit

Peach Fruit

5 Health Benefits of Eating Peaches: ‘మకరంద పండు’ లేదా ‘పీచు పండు’ ఎక్కువగా వాయవ్య చైనాలో పండుతుంది. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవి. ఈ పండ్ల మధ్యలో ఒకటే గింజ ఉంటుంది. చెర్రీస్, ఆప్రికాట్స్, నెక్టారిన్స్, ప్లమ్స్ ఇలాంటివే ఈ పీచ్ ఫ్రూట్. పీచ్ పండ్ల లోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది. పీచు పండు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో.. ఆరోగ్యానికి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు రుచిని కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, నియాసిన్, కాపర్, మాంగనీస్, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటివి పొందవచ్చు. ఈ పండు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో (Amazing Benefits Of Peaches) ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెకు మంచిది:
రోజూ పీచ్ ఫ్రూట్ తింటే గుండెకు అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ పండు అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాదు ట్రైగ్లిజరైడ్‌ను కూడా తగ్గిస్తుంది. భారతదేశంలో చాలా మంది ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారు. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు పీచ్ ఫ్రూట్ తినాలి.

చర్మాన్ని కాపాడుతుంది:
చర్మాన్ని కాపాడటంలో పీచ్ పండ్లు పని చేస్తాయి. స్కిన్ ముడుతలు పడకుండా, కోమలంగా ఉండేందుకు, పొల్యూషన్ నుంచీ కాపాడుకునేందుకు మకరంద పండ్లను తినాలి. స్కిన్‌కి అత్యవసరమైన కొల్లాజెన్ నిర్మాణంలో పీచ్ పండ్లలోని సీ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: Virat Kohli Boundary: విరాట్ భయ్యా సెంచరీ కాలేదు ఇంకా.. నవ్వులు పూయిస్తున్న బౌండరీ వీడియో!

క్యాన్సర్ నివారణ:
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీన్ని ప్రారంభ దశలో గుర్తించకపోతే.. ప్రాణాలు పోతాయి. కాబట్టి క్యాన్సర్‌ను నివారించడానికి పీచు పండును తినాలి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అయిన కెరోటినాయిడ్లు మరియు కెఫిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

కళ్ల సమస్యలకు చెక్:
రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువగా పీచ్ పండ్లను తింటే వయసు పెరిగేటప్పుడు కళ్లకు ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు పీచ్ పండ్లను తినాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా బయటకు పోతుంది.

అజీర్ణం నుంచి ఉపశమనం:
ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ తినడం వల్ల మనం తరచుగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం మరియు అసిడిటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు పీచ్ ఫ్రూట్ తినాలి. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడా సులభతరం చేస్తుంది.

Also Read: WI vs IND Day 2 Highlights: రోహిత్‌, జైస్వాల్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్!