Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం..

Cm Revanth

Cm Revanth

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ని కోరారు నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్.

Also Read:Viral Video: ఇదేందయ్యా ఇది.. సైకిల్ పంప్‌తో విమానం టైరుకు గాలి నింపడం ఏంటయ్యా!

శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది.. తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదు.. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటాం.. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version