Site icon NTV Telugu

Mehbooba Mufti: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో రిగ్గింగ్.. మెహబూబా ముఫ్తీ ఆందోళన..!

Mufti

Mufti

PDP Chief Mehbooba Mufti: ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతంలోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధినేత మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగింది. తన పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన సెల్ ఫోన్‌లో అవుట్‌ గోయింగ్ కాల్స్ బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అనంత్ నాగ్-రాజౌరీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది.

Read Also: Loksabha Elections : కొన్ని చోట్ల పాడైపోయిన ఈవీఎంలు.. ట్యాంపరింగ్ ఆరోపణలు

కాగా, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. అంతకు ముందు పీడీపీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు స్టేషన్ కు తీసుకున్నారని ముఫ్తీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. మరోవైపు, నేటి ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 16.54 శాతం, అత్యల్పంగా ఒడిశాలో 7.43 శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Exit mobile version