రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించానున్నారు. మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభినందన సభ పై చర్చ జరుగనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
TS Congress: రేపు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం

Pcc Meeting