ఆసియా కప్-2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భారత్, పాక్ మధ్య నెలకొన్న విభేదాల దృష్ట్యా పాకిస్తాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే వేదిక మార్పు కోసం కొంతకాలంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ టోర్నీలోని ఇండియా మ్యాచ్‌లకు యూఏఈని వేదికగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మిగిలిన మ్యాచ్‌లను పాకిస్తాన్‌లోనే నిర్వహించేలా ఏసీసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం..ఇండియాలో ఆ ట్విట్టర్ ఆఫీసులు మూసివేత!
ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఇండియా ఒప్పుకోని పక్షంలో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. తమ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనదని పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ ఇటీవల కామెంట్స్ చేశారు. సేథీ కామెంట్స్ ఇరు దేశాల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. భారత్ పట్టుదలను షాహిద్ అఫ్రిదీతో పాటు మరికొందరు పాకిస్తాన్ క్రికెటర్లు తప్పుపట్టారు. బీసీసీఐ ఆర్థికంగా బలంగా ఉండటంతో దానికి ఎదురు తిరిగి మిగిలిన సభ్య దేశాలు ఏం చేయలేకపోతున్నాయంటూ అఫ్రిదీ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది.
Also Read: Zomato: డెలివరీ బాయ్స్ కోసం జొమాటో రెస్ట్ షెల్టర్స్.. ఇక ఆ ఇబ్బందులకు చెక్!