PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న వేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనను అరికట్టేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మైక్ స్మిత్‌ను జాతీయ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. లెవెల్-4 కోచ్ అయిన స్మిత్‌కు టీ20 ఫ్రాంచైజ్ లీగ్‌లలో, ముఖ్యంగా పీఎస్ఎల్ జట్లతో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. విండీస్ పర్యటనలో తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న జాతీయ సెలక్టర్ అసద్ షఫీక్ స్థానంలో స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో తీవ్రంగా శ్రమిస్తోంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయిన పాక్, రెండో టెస్టులోనూ వెనుకబడి ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో సహా ప్రధాన బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో మార్పులు తెచ్చేందుకు మైక్ స్మిత్‌ను ఎంపిక చేశారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
- Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
ఆగస్టు 19 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన నాటికి స్మిత్ జట్టుతో చేరనున్నారు. ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు: ఆగస్టు 19 – 23 (హెడింగ్లే, లీడ్స్), రెండో టెస్టు: ఆగస్టు 27 – 31 (లార్డ్స్), మూడో టెస్టు: సెప్టెంబర్ 9 – 13 (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్). ఇంగ్లాండ్ కఠిన పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన స్మిత్ మార్గదర్శకత్వం పాక్ బ్యాటర్లకు ఎంతవరకు కలసివస్తుందో, జట్టు రాతను మారుస్తుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
-
Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
-
Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
-
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!