NTV Telugu Site icon

KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

Kkr Vs Pbks

Kkr Vs Pbks

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. కాగా.. ఈ మ్యాచ్ కోల్కతా హోంగ్రౌండ్ లో జరుగుతుంది. కావున వారికే ఎక్కువ విజయవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే.. మిగతా అన్ని మ్యాచ్ లు తప్పగా గెలవాల్సిన పరిస్థితి. అందుకోసం.. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, దుష్మంత చమీర.

పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్:
జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్.

Show comments