Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రీపెయిడ్ వాలెట్లను జారీ చేయడానికి పేటీఎం సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. వన్ 97 కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (PPSL) డిజిటల్ వాలెట్లతో సహా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ జారీ చేయడానికి, నిర్వహించడానికి ఈ అనుమతిని పొందింది. అయితే.. వాలెట్ సేవలను తిరిగి ప్రారంభించడానికి ముందు సంస్థ ఆర్బీఐ నుంచి తుది నియంత్రణ అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఆగస్టు 27, 2021న ఆర్బీఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్, ఆ తర్వాత చేసిన సవరణలకు లోబడి ఈ ఆమోదం లభించింది. ప్రస్తుత సూత్రప్రాయ అనుమతితో పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ తక్షణమే వాలెట్ సేవలను ప్రారంభించడానికి వీలులేదు. దీనికోసం కేంద్ర బ్యాంకు నుంచి తుది ‘సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్’ తప్పనిసరిగా పొందాలి.
Also Read
- Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
- Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
- Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
- Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
గతంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై ఆర్బీఐ తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. నిబంధనల ఉల్లంఘన, కార్యకలాపాలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్ 24, 2026న ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసి, బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది. అంతకుముందే 2022 మార్చిలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై, 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఖాతాలు మరియు వాలెట్లలో డిపాజిట్లు, టాప్-అప్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
అయితే, తాజాగా లభించిన ఆమోదం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కాకుండా, వన్ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ప్రత్యేక అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు మాత్రమే లభించింది. ఆర్బీఐ తుది అనుమతి లభించిన తర్వాత, పేటీఎం తన వాలెట్ సేవలను తిరిగి అందించడానికి ఈ నిర్ణయం ఒక ప్రత్యేక నియంత్రణ మార్గాన్ని సుగమం చేసింది.
తాజావార్తలు
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?