Site icon NTV Telugu

Basavaraj Bommai : పేసీఎం పేరిట వెలిసిన పోస్టర్లు.. 40 శాతం అవినీతి అంటూ..

Basavaraj Bommai

Basavaraj Bommai

PayCM Posters with CM Bommai face in Bengaluru

కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో “PayCM” శీర్షికతో కూడిన పోస్టర్‌లు బుధవారం నాడు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. అవి ఎలక్ట్రానిక్ వాలెట్ పేటీఎం (PayTM) డిజైన్‌ను పోలి ఉన్నాయి. “40 శాతం ఇక్కడ అంగీకరించబడ్డాయి” అనే సందేశంతో క్యూఆర్ కోడ్ మధ్యలో సీఎం బొమ్మై ముఖాన్ని ముద్రించి ఉన్నాయి. అయితే.. కర్ణాటకలో అధికార బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ప్రభుత్వంపై 40 శాతం కమీషన్ ఆరోపణలను చేస్తూ.. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది కాంగ్రెస్.

 

గత వారం, సెప్టెంబర్ 13న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “40 శాతం అవినీతి” ఆరోపణలపై ప్రచారాన్ని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రారంభించింది. అంతేకాకుండా.. కేపీసీసీ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (844 770 40 40)ని ప్రకటించడమే కాకుండా ప్రజలు కాల్ చేయడానికి లేదా లాగిన్ చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి www.40percentsarkara.com వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది.

 

 

 

Exit mobile version