Site icon NTV Telugu

Payal Rajput : పబ్ లోరెచ్చిపోయిన.. ప్రియుడి తల పగలగొట్టేసిందిగా.. వీడియో వైరల్..

Payaaal

Payaaal

పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాట్ కే హీటేక్కిస్తుంది.. ఘాటు అందాలను ఎప్పుడూ దాచుకోదు.. దాంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఆర్ఎక్స్ 100`(RX100)తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా వరుస సినిమాలు చేసినా కూడా వాటితో పెద్దగా హిట్ టాక్ ను దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా మంగళవారం సినిమా చేసింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది.. తాజాగా పాయల్ కు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. వాలంటైన్స్ డే ను సెలబ్రిటీలు సైతం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లవర్‌తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు.. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో పాయల్ తన ప్రియుడి తల పగలగొడుతున్నట్లు కనిపించింది. పబ్ లో అంతముందు ఏం జరిగిందో.. లేకుంటే అమ్మడు ఎందుకు అలా చేస్తుంది అని నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.. తన పర్సనల్ లైఫ్‌లో కూడా తన ప్రియుడు సౌరభ్‌తో పాయల్ చాలా హ్యాపీగా ఉన్నారు. పంజాబీ ఇండస్ట్రీలో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరు కలిసి అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అయితే వాలంటైన్స్ డే రోజు పాయల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడి తల బద్దలు కొట్టినట్లుగా కనిపిస్తుంది.. మరి ఇదంతా చూస్తుంటే ఏదో రీల్ గా ఉందని అంటున్నారు.. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version