Site icon NTV Telugu

Payal Rajput: ఆసుపత్రిలో చేరిన పాయల్ తల్లి.. ఏం జరిగిందంటే?

Payall

Payall

పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా తన తల్లికి సంబందించిన పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తన తల్లికి సర్జరీ చేయించింది. మోకాళ్లకు జరిగిన ఈ ఆపరేషన్ చాలా పెయిన్ ఫుల్‌గా ఉందని, అయినా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని, అమ్మ నడుస్తోందంటూ.. అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ పాయల్ వేసిన ఎమోషనల్ పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఆపరేషన్ అనంతరం అమ్మ ఎలా నడుస్తోందో అని ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది..

ఇక సినిమాల విషయానికోస్తే.. ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదనిపిస్తోంది. ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ పేరు ఒక్కసారిగా తెలుగులో మార్మోగిపోయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో సీరియల్స్ చేసుకుంటూ ఉండేది. పంజాబీ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేసింది.. అందం టాలెంట్ ఉన్న ఈ అమ్మడును మేకర్స్ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు.. ఇటీవల మంగళవారం సినిమా లో నటించింది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతుందని సమాచారం..

Exit mobile version