NTV Telugu Site icon

Cannes Film Festival 2024: కేన్స్‌లో భారతీయ చిత్రం ప్రదర్శన.. మూవీ టీమ్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌!

All We Imagine As Light

All We Imagine As Light

Indian Movie in Cannes Film Festival 2024 Competition: ఫ్రాన్స్‌ వేదికగా 77వ కేన్స్ ​ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. మే 14న ఆరంభం అయిన ఈ వేడుక.. మే 25 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్‌లో ఉంది. కేన్స్‌ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డుల కేటగిరీలో మలయాళీ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీలో నిలిచింది. మే 23న ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెడ్‌ కార్పెట్‌పై చిత్ర యూనిట్ మెరిసింది.

ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ డైరెక్టర్ పాయల్‌ కపాడియాతో పాటు నటీనటులు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. అందరూ డ్యాన్స్‌లు చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకున్నారు. మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కేన్స్‌లో మంచి ఆదరణ లభించింది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ ప్రదర్శన తర్వాత టీమ్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

Also Read: KL Rahul: టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

పాయల్‌ కపాడియా దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్‌ సినిమా ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌. ఫిల్మ్ వేడుకల్లో భారత్‌ నుంచి ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ పోటీలో నిలవడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1994లో స్వహం సినిమా పామ్‌ డి ఓర్‌ కేటగిరీలో పోటీ పడింది. తాజాగా ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ నిలిచింది. ఈ సినిమాతో పాటు యోర్గోస్ లాంతిమోస్, మెగాలోపోలిస్, ఓహ్ కెనడా, బర్డ్, అనోరా తదితర చిత్రాలు బరిలో ఉన్నాయి. విజేతను మే 25న ప్రకటించనున్నారు.