NTV Telugu Site icon

Sai Dharam Tej : పవన్ కల్యాణ్ గెలుపు.. కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్..

Saidharm Tej

Saidharm Tej

Sai Dharam Tej : ఆంద్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది.ఎన్డియే లో భాగం అయిన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు గాను 21 విజయం సాధించింది.అలాగే పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు.అయితే గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం ,గాజువాక రెండు చోట్ల ఓడిపోయారు.ఓడిపోయినా కూడా అధైర్య పడకుండా పవన్ కల్యాణ్ ఎంతో ఓర్పుతో వ్యవహరించారు .

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదు అనే ఉద్దేశంతో ఈ సారి టీడీపీ ,బీజేపీ తో కలిసి పోటీచేసారు.పిఠాపురంలో పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచింది.మెగా హీరోలు వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ ,వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేసారు.అలాగే ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. వీరందరి మద్దతుతో పవన్ అద్భుత విజయం సాధించాడు.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాడు.తాజాగా ఆ మొక్కును తీర్చుకోవడం కోసం కాలినడకన తిరుమలకు వెళ్లారు.ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పిక్స్ వైరల్ గా మారాయి.