NTV Telugu Site icon

Pawan Kalyan: పార్టీ నడపడానికి సినిమాలే నాకు ఇంధనం

Pawan 2

Pawan 2

పార్టీ నడపడానికి సినిమాలే తనకు ఇంధనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో వారాహి విజయయాత్రలో భాగంగా.. గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో జగన్ కు రోజూ చూపిస్తానని విమర్శించారు. జగన్ ఎన్ని వేషాలు వేసినా మీరు భరించాలిసింది ఆరు నెలలు మాత్రమేనని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమైనా అంటే గయ్యాళ్ళు మాదిరి విరుచుకుపడుతున్నారని వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తన వ్యక్తిగత జీవితం.. తల్లీ, భార్య, పిల్లలను టార్గెట్ చేసిన తాను ఖాతరు చేయనన్నారు.

Karthikeya 2: ఇంకా కృష్ణ ట్రాన్స్ లో ఉన్నాం భయ్యా.. అప్పుడే ఏడాది అయిపోయిందా.. ?

లక్షల కోట్లు విలువున్న ఏపీకి రావాలిసిన ఆస్తులు స్వప్రయోజనాల కోసం తెలంగాణకు వదిలేసిన వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. అన్నీ అనుకూలిస్తే వైజాగ్ లో రెండో ఇల్లు కట్టుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ మీతో ఉంటే ఆ ధైర్యం వేరు అని తెలిపారు. పెదజాలరిపేట దగ్గర చేసిన ఎంపీ నిర్మాణాల విషయంలో టీడీఆర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. మరోవైపు మళ్లీ వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. వాలంటీర్లుకు యజమాని ఎవరు అని ప్రశ్నించారు. డేటా ఎక్కడికి పోతోంది.. జీత భత్యాలు ఎక్కడ నుంచి ఇస్తున్నారంటే కిక్కురు మనడం లేదని అన్నారు.

Suriya: క్లాస్ లుక్ లో.. ఏమున్నాడురా బాబు..

మూడేళ్ళలో వైజాగ్ ఐటీకి వైభవం తెస్తామని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఋషికొండలో వాల్టా యాక్ట్ ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిందని పవన్ పేర్కొన్నారు. చట్టాల ఉల్లంఘనకు పాల్పడే ముఖ్యమంత్రి దిగిపోవాలని ఆయన అన్నారు. వైజాగ్ ఎంపీ సిరిపురం జంక్షన్లో అనుమతి లేకుండా కడుతున్న నిర్మాణాలను కూల్చి వేస్తామని హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీకి చెందిన సిరిపురం ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టిన లోన్లు.. మంజూరు చేసిన వారు నష్టపోతారని సూచించారు. గుండా ఎంపీ అయినందుకు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీపై మళ్లీ రౌడీషీట్ తెరిపిస్తానని పవన్ తెలిపారు.

Pawan Kalyan: గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం

గాజువాక నుంచి చెబుతున్నాను జగన్.. జనం మేల్కొన్నారు గద్దె దిగి వెళ్లిపో అని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. జగన్ దేవుడు అనుకుంటే దెయ్యంగా మారి వేదిస్తున్నాడని ఆరోపించారు. జగన్ ను అదృష్టం అందలం ఎక్కిస్తే.. బుద్ధి బురదలోకి జారిపోయిందని సెటైర్ వేశారు. మరోవైపు జనసేన పార్టీ నడపడానికి సినిమాలే తనకు ఇంధనం అని అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల భవిష్యత్, నేల కోసం పోరాడతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జగన్ ను మరోసారి భరించలేమని.. జగన్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం అయినా స్వాగతిద్ధామన్నారు. ఓటు చీలిపోకూడదు అనేది తమ అభిప్రాయమని.. జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. జరుగుతున్న విధ్వంసం మీదే తమ ఆందోళన అని పవన్ కల్యాణ్ అన్నారు.