వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. జగన్ 2.O చూపిస్తే మేం 10 రెట్లు ఎక్కువే చూపిస్తాం అన్నారు. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బలహీనులే ఇలా మాట్లాడుతారని.. బలవంతులు ఎవరూ కూడా ఇలా మాట్లాడరన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని పవన్ కల్యాణ్ అన్నారు.
సీఎం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్ జనజీవన స్రవంతికి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆయనకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా… స్థానిక సంస్థల ఎన్నికల్లో సవాళ్లు మరో విధంగా ఉంటాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాలకు మాత్రమే ఉంటుందని, ఇప్పుడు సీట్ల సర్దుబాటు ఎక్కువ స్థానాలకు చేసుకోవాల్సి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ మాట్లాడారు.

