Pawan Kalyan: కేవలం ఓ చిత్రం కాదు.. ‘హరి హర వీరమల్లు’ కథపై పవన్ కళ్యాణ్ ట్వీట్!
- ప్రేక్షకుల ముందుకు హరి హర వీరమల్లు
- వీరమల్లు కథపై పవన్ కళ్యాణ్ ట్వీట్
- నిజాన్ని బట్టబయలు చేస్తోన్న ధర్మ గాథ
- సనాతన ధర్మం అంటే ఏమిటో చూపించే కథ ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Tweet on Hari Hara Veera Mallu Story: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ నటించిన మొదటి సినిమా ‘హరి హర వీరమల్లు’. సుదీర్ఘ విరామం తర్వాత (బ్రో సినిమా అనంతరం) పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు ఫాన్స్ అంచనాలను అందుకుంది. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే వీరమల్లు సినిమా కథపై ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం ఓ చిత్రం కాదు.. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఓ గౌరవ గాథ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘హరి హర వీరమల్లు చరిత్రను శోధిస్తూ, నిజాన్ని బట్టబయలు చేస్తోన్న ధర్మ గాథ. ఔరంగజేబ్ విధించిన జిజియా పన్ను హిందువులపై మతపరమైన అణచివేతకు నిలువెత్తు చిహ్నం. చరిత్రలో దాగిపోయిన దుర్మార్గం. కొంతమంది చరిత్రకారులు జిజియా పన్ను దారుణతను సున్నితంగా చూపించినా.. వాస్తవంలో అది ఒక మతపరమైన దోపిడీ. హరి హర వీరమల్లు నిజాన్ని దాచిన చరిత్రను ధైర్యంగా బయటపెడుతూ.. హిందువులపై జరిగిన అన్యాయాన్ని సమర్థంగా బట్టబయలు చేస్తోంది. భారత సంపద దోపిడీ కోహినూర్ ఉదాహరణ మాత్రమే. మొగల్ కాలంలో దేశ సంపదను ఎలా ఎత్తుకెళ్లారో సినిమా క్లియర్‌గా చూపిస్తుంది. దుర్మార్గ పాలకులకు భయపడకుండా ఎదురు నిలిచిన నిజమైన వీరుల కథ. చరిత్రలో మరిచిపోయిన ధర్మ యోధుల పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చింది హరి హర వీరమల్లు. సనాతన ధర్మం అంటే ఏమిటో చూపించే కథ ఇది. ఇది కేవలం ఓ చిత్రం కాదు.. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఓ గౌరవ గాథ’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
- Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన "బేబీ బాస్" వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
Also Read: Crime News: మరో ఆణిముత్యం.. భార్య చేతిలో భర్త బలి! మూడేళ్ల కుమార్తెను ఆరా తీయగా
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వస్తున్న ‘ఓజీ,’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. సెప్టెంబరులో ఓజీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు ప్రచారంలో భాగంగా ఉస్తాద్ షూటింగ్ ఆలస్యమైంది. డిసెంబరు లేదా జనవరిలో ఉస్తాద్ రిలీజ్ అవుతుంది. ఇక పవన్ మరే సినిమా ఒప్పుకోలేదు. సినిమాలు, రాజకీయాలలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. మూవీస్ చేయను అని తాజాగా పవన్ స్పష్టం చేశారు. పరిపాలన, పార్టీ బలోపేతమే తన ప్రాధాన్యాలు అని పేర్కొన్నారు. అయితే ఆర్థిక స్థిరత్వానికి సినిమా అవసరం అని, సమయం దొరికితే నటిస్తానేమో అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
-
Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్‌లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
-
Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
-
FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!