Site icon NTV Telugu

Pawan Kalyan: కేవలం ఓ చిత్రం కాదు.. ‘హరి హర వీరమల్లు’ కథపై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Hhvm

Hhvm

Pawan Kalyan Tweet on Hari Hara Veera Mallu Story: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్‌ కల్యాణ్‌ నటించిన మొదటి సినిమా ‘హరి హర వీరమల్లు’. సుదీర్ఘ విరామం తర్వాత (బ్రో సినిమా అనంతరం) పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు ఫాన్స్ అంచనాలను అందుకుంది. వీరమల్లుగా పవన్‌ కళ్యాణ్ నటన, యాక్షన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే వీరమల్లు సినిమా కథపై ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం ఓ చిత్రం కాదు.. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఓ గౌరవ గాథ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘హరి హర వీరమల్లు చరిత్రను శోధిస్తూ, నిజాన్ని బట్టబయలు చేస్తోన్న ధర్మ గాథ. ఔరంగజేబ్ విధించిన జిజియా పన్ను హిందువులపై మతపరమైన అణచివేతకు నిలువెత్తు చిహ్నం. చరిత్రలో దాగిపోయిన దుర్మార్గం. కొంతమంది చరిత్రకారులు జిజియా పన్ను దారుణతను సున్నితంగా చూపించినా.. వాస్తవంలో అది ఒక మతపరమైన దోపిడీ. హరి హర వీరమల్లు నిజాన్ని దాచిన చరిత్రను ధైర్యంగా బయటపెడుతూ.. హిందువులపై జరిగిన అన్యాయాన్ని సమర్థంగా బట్టబయలు చేస్తోంది. భారత సంపద దోపిడీ కోహినూర్ ఉదాహరణ మాత్రమే. మొగల్ కాలంలో దేశ సంపదను ఎలా ఎత్తుకెళ్లారో సినిమా క్లియర్‌గా చూపిస్తుంది. దుర్మార్గ పాలకులకు భయపడకుండా ఎదురు నిలిచిన నిజమైన వీరుల కథ. చరిత్రలో మరిచిపోయిన ధర్మ యోధుల పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చింది హరి హర వీరమల్లు. సనాతన ధర్మం అంటే ఏమిటో చూపించే కథ ఇది. ఇది కేవలం ఓ చిత్రం కాదు.. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఓ గౌరవ గాథ’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Also Read: Crime News: మరో ఆణిముత్యం.. భార్య చేతిలో భర్త బలి! మూడేళ్ల కుమార్తెను ఆరా తీయగా

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వస్తున్న ‘ఓజీ,’ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. సెప్టెంబరులో ఓజీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు ప్రచారంలో భాగంగా ఉస్తాద్‌ షూటింగ్‌ ఆలస్యమైంది. డిసెంబరు లేదా జనవరిలో ఉస్తాద్‌ రిలీజ్ అవుతుంది. ఇక పవన్ మరే సినిమా ఒప్పుకోలేదు. సినిమాలు, రాజకీయాలలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. మూవీస్ చేయను అని తాజాగా పవన్ స్పష్టం చేశారు. పరిపాలన, పార్టీ బలోపేతమే తన ప్రాధాన్యాలు అని పేర్కొన్నారు. అయితే ఆర్థిక స్థిరత్వానికి సినిమా అవసరం అని, సమయం దొరికితే నటిస్తానేమో అని చెప్పుకొచ్చారు.

Exit mobile version