NTV Telugu Site icon

Pawan Kalyan: రైతన్నకు అండగా పవన్‌.. రేపు తూర్పు గోదావరిలో పర్యటన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు రాజమండ్రి చేరుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు జనసేనాని.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై జనసేన అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మేల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రేపు తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 10 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం అవుతుందన్నారు..

Read Also: Farmers : అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై లారీల కోసం రైతుల తిప్పలు..

కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శించనున్న పవన్‌ కల్యాణ్‌.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. మధురపూడి విమానాశ్రయం నుండి పవన్‌ కల్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.. కడియం, కొత్తపేట అనంతరం పి.గన్నవరం మండలం రాజులపాలెంలోనూ పవన్‌ పర్యటన కొనసాగనుంది.. సాయంత్రం తిరిగి రాజమండ్రికి చేరుకుని విమానంలో హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కాగా, రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన నేతలు పరామర్శించారు. ఇప్పుడు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నేరుగా రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. ఈ పర్యటనలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు జనసేన రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొనబోతున్నారు.