Site icon NTV Telugu

Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

Jailar 2 Rajinikanth Pawankalyan

Jailar 2 Rajinikanth Pawankalyan

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie) చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలను గెస్ట్ రోల్స్‌లో చూపించి మ్యాజిక్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సీక్వెల్ కోసం అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

తన నెక్స్ట్ మూవీ ‘కింగ్’ (King) లుక్ రివీల్ కాకూడదనే కారణంతో షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.అంతే కాదు మరో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే.. షారుఖ్ ఖాన్ స్థానంలో ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కేమియో పాత్ర కోసం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్ అనుకూలంగా ఉంటే సినిమాలు చేస్తానని పవన్ గతంలోనే మాట ఇచ్చారు. దీంతో నెల్సన్ పక్కా ప్లాన్‌తో పవన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ నిజంగా రజినీకాంత్-పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version