NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వదిన ఇచ్చిన పెన్‌తో తొలి సంతకం..!

Pk

Pk

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు జనసేనాని.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఈ మధ్యే.. మెగాస్టార్‌ చిరంజీవి భార్య, తన వదిన సురేఖ.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఓ పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు.. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేస్తున్న తరుణంలో.. తన వదిన గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్నును ఉపయోగించారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Lucky Baskhar : ‘ కోపాలు చాలండి శ్రీమతి గారు ‘ అంటున్న దుల్కర్ సల్మాన్..

ఇక, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. మెగా బ్రదర్‌, సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. తదితర నేతలు పవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. మరోవైపు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శశి భూషణ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Show comments