Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్.. ?

Pawankalyan

Pawankalyan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఫుల్ స్పీడ్‌లో పూర్తిచేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పవన్ తర్వాత చేసే సినిమా ఏది? ఎవరితో? ఎలా ఉంటుంది? అనే క్యూంరియాసిటీ ఫ్యాన్స్‌లో ఎప్పుడూ హైగానే ఉంటుంది. ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి మరింత కలర్‌జోడించేలా ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం, పవన్ తన తరువాతి ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడట. మొదటి సారి ఈ ఇద్దరి కాంబినేషన్ కాబట్టి ఫ్యాన్స్ లో, ఈ మూవీలో పవన్ ఏ పాత్రలో గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమాలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. ఆ విషయం అంతా ఇంటర్వెల్ కి ముందు  రివీల్ అవుతుందని, ఇంటర్వెల్ తర్వాత మాత్రం పవన్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లి బుల్లెట్‌లే కాదు.. మాస్ ఫ్యాన్స్ హార్ట్‌లను కూడా గుద్దేలా ఫైర్ అవుతాడని అంటున్నారు. ఇదంతా విన్న పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా గురించిన అంచనాలు ఇప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.

కాగా మార్చి నుండి పవన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడని వార్తలు బయటకొస్తున్నాయి. ఇంకా మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఈ సినిమాలో మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడట. అయితే, ఆ హీరో ఎవరు? స్టార్ హీరోనా? యంగ్ హీరోనా? లేక స్పెషల్ అప్పియరెన్స్ నా? అన్నది మాత్రం మేకర్స్ ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు. మొత్తం మీద, పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ పైన ఇప్పటి నుంచే భారీ హైప్ ఏర్పడింది. పవర్‌స్టార్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపిస్తాడనే మాట ఒక్కటే ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తోంది.

Exit mobile version