ఇవాళ 29 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు రూ. 5 వేల కోట్లు విలువ చేసే పనులు శంఖుస్థాపన జరుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం భారత ఐక్యతకు పునాదని తెలిపారు. భారత రత్న వాజపేయి దేశ రహదారుల ను మార్చి ముందడుగు వేశారు. ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతమైన నాయకులు గా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారు.. వికసిత భారత్ వైపు ప్రయాణం చేస్తున్నాం.. గడ్కరీ దూరదృష్టి పట్టుదల ప్రత్యేకమని పవన్ అన్నారు. లక్ష 46 వేల కిమి జాతీయ రహదారులు పెరిగాయి. నిర్మాణ వేగం మూడు రెట్లు బడ్జెట్ ఆరు రేట్లు పెరిగాయని వెల్లడించారు.
READ MORE: Transgender In Court: కోర్టులో ట్రాన్స్‌జెండర్ వీరంగం.. బట్టలు చించుకొని రచ్చ రచ్చ!
గడ్కరిని హై వై మాన్ ఆఫ్ ఇండియా అంటారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.. మన రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో కొండ రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి పథంలో అందరూ బావుండాలని పీఎం జన్ మన్ పథకంలో అడవి తల్లి బాటలు వేస్తున్నారని చెప్పారు. డోలి మోతల ఇబ్బందులు తొలగిపోతాయి. గత ప్రభుత్వం కూల్చివేతలతో మొదలయిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఊరికి ఊరికి మధ్య రోడ్లు వేస్తున్నామని.. ఒక పదిహేనేళ్లు కూటమి ఉండాలన్నారు. కూటమి ఐక్యత ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు.. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి తెలియాలి. తాను చేసిన కృషి వల్ల కూటమి ఏర్పడి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు సరిదిద్దుకోవాలని సూచించారు.
READ MORE: Liquor Scam: మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై కోర్టు కీలక ఆదేశాలు..
