NTV Telugu Site icon

Pawan Kalyan : ఇదే భారతీయ సంస్కృతి.. యునెస్కో గుర్తింపుపై పవన్

Pawan

Pawan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీత, భరతముని నాట్య శాస్త్రాలకు చోటు దక్కడంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. మన సంస్కృతి మన దేశానికి ఆత్మ లాంటిదన్నారు. ఈ సంస్కృతి ఎన్నడూ గుర్తింపు కోరుకోలేదని.. మానవాళికి మంచిని అందించడమే దాని ఉద్దేశం అన్నారు. ఇప్పుడు యునెస్కో మన సంస్కృతిని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సనాతన ధర్మానికి శాశ్వత చిహ్నంగా, ఆధ్యాత్మిక సత్యానికి అమర మార్గదర్శిగా ఉందని చెప్పుకొచ్చారు.

Read Also : Vedhika : వేదిక ఏంటీ అందాల అరాచకం..

‘భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శి.. వేల ఏళ్ల నాటి నాట్య కళకు భారత దేశం ప్రతీక. నాగరికతను నేర్పించిందే మన భగవద్గీత. మన నమ్మకాలను, వ్యవస్థలను పెంచడానికి ఈ గుర్తింపు చాలా అవసరం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా మన ధర్మం గురించి చేస్తున్న కృషి వల్లే ఇది సాధ్యం అయింది. మన దేశ కల్చర్ శాఖ కూడా దీని వెనకాల ఉంది. ఇది మనందరికీ గొప్ప విషయం’ అంటూ తెలిపారు పవన్ కల్యాణ్‌. ఆయన చేసిన ట్వీట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.