పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లు తెలుస్తుంది.అయితే బ్రో సినిమా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ను కొన్ని కారణాల వల్ల షూటింగ్ సగంలో ఉండగానే నిలిపి వేశారు.ఎన్నికల తర్వాతే హరి హర వీరమల్లు సినిమా ను పూర్తి చేస్తారు అంటూ ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కు పవన్ హాజరు అవుతున్నారని తెలుస్తుంది..తాజాగా ప్రారంభించబోతున్న షెడ్యూల్ తో భారీ మొత్తం లో సన్నివేశాలను పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం..
ఈ సినిమా షూటింగ్ కోసం క్రిష్ సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు క్రిష్ ఎంతో హడావుడి చేస్తున్నట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వల్ల వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనీ భావిస్తున్నారు. దీనితో వరుస సినిమాలను ఒప్పుకుంటూ వాటి షూటింగ్ తక్కువ రోజుల్లోనే ముగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే హరి హర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ సినిమా కావడంతో సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. ఇక పై ఈ సినిమా ను ఆలస్యం చేయకుండా స్పీడ్ గా కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
