NTV Telugu Site icon

Pawan Kalyan : లుక్ అదిరిందిగా.. హరిహర వీరమల్లు షూట్ నుంచి పవన్ ఫోటో లీక్

New Project (24)

New Project (24)

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు. ఆయన అభిమానుల కోసం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కోసం మంగళగిరిలోనే సెట్ వేశారు. ఆ సెట్‌లో పవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.

Read Also:TTD laddu controversy: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తులో సిట్‌ దూకుడు.. టీమ్‌లు విడిపోయి..!

ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా ఆలస్యమవడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి చాలా స్పెషల్ సాంగ్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దసరా కానుకగా పవన్ కళ్యాణ్ అభిమానులకు తొలి పాటను విడుదల చేసే అవకాశాలున్నాయి. అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ హరిహర వీరమల్లు సినిమాలోని మొదటి పాటను దసరాకు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది.

Read Also:T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం!

హరిహర వీరమల్లు సెట్స్ నుంచి లీకైన ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ సినిమా కాస్ట్యూమ్ తో నవ్వుతూ ఉన్నారు. ఆ పక్కనే మరో ఆర్టిస్ట్ ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఒక్క ఫొటోకే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు ట్రెండ్ అవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది. లీక్ అయిన ఫోటో మీరు కూడా చూసేయండి.. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.