NTV Telugu Site icon

Pawan Kalyan: వదిన దగ్గర రూ. 2 కోట్లు అప్పు చేసిన పవన్ కళ్యాణ్

List

List

Pawan Kalyan: పీఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంపాదనతో పాటు అప్పుల వివరాలను వెల్లడించారు. తన అయిదేళ్లలో రూ.114.76 కోట్లు సంపాదించినట్లు వెల్లడించిన ఆయన అప్పుల వివరాలు సైతం తన అఫిడవిట్ ద్వారా తెలిపారు. ఆయన రూ.64,26,84,453 ల అప్పులు తీసుకున్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి రూ.46,70,000 పుచ్చుకున్నట్లు పత్రాల్లో పొందుపర్చారు. వ్యక్తి గత రుణాల కింద మొత్తం 15 మందితో నగదు తీసుకున్నారు. వారిలో పవన్ వదిన, చిరంజీవి భార్య కొణిదెల సురేఖ సైతం ఉండటం విశేషం.

READ MORE: Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..

ఆమె దగ్గర రూ. 2 కోట్లు వ్యక్తి గత రుణం కింద పుచ్చుకున్నట్లు ఆఫిడవిట్లో పొందు పర్చారు. అంతే కాకుండా విజయలక్ష్మి వీఆర్- రూ.8,00,00,000, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ -రూ.6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- రూ. 6,00,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్- రూ. 3,50,00,000, యుర్నేని నవీన్- రూ. 5,50,00,000, ప్రవీణ్ కుమార్- రూ.3,00,00,000, మైత్రీ మూవీ మేకర్స్- రూ.3,00,00,000, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్- రూ.3,00,00,000, రాహుల్ కుందవరం- రూ.2,80,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ- రూ.2,00,00,000, కొణిదెల సురేఖ- రూ.2,00,00,000, కోటింరెడ్డి సాహిత్యరెడ్డి- రూ. 50,00,000, లింగారెడ్డి లలిత- రూ. 50,00,000, దయాకర్- రూ.45,00,000, డీవీవీ ఎంటర్‌ప్రైజెస్- రూ.10,00,000ల ద్వారా వ్యక్తిగత రుణాలు పొందినట్లు జాబితాలో ఉంది.