NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు జనసేన జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ భేటీ..

Pawan

Pawan

Janasena: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికలకు రెడీ అవుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలకు సంబంధించిన పలు కార్యక్రమాల కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే, నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిటీలతో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. అలాగే, సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పార్టీ జోన్ల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేూసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ జోన్లుగా విభజించారు. కాగా ఈ కమిటీల్లో కన్వీనర్లు, కో- కన్వీనర్లు సభ్యులు ఉండనున్నారు. అలాగే, లీగల్, డాక్టర్‌ సెల్స్ తరఫున సభ్యులు కూడా ఉన్నారు.