NTV Telugu Site icon

Pawan Kalyan: అధికారంలో భాగస్వామ్యం.. పవన్‌ కీలక వ్యాఖ్యలు

Pawan

Pawan

Pawan Kalyan: అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్‌.. ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చే సింది జనసేన. సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్‌ కల్యాణ్.. ఇక, పవన్ కు శాలువా కప్పి సన్మానించారు వర్మ. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జనసేనాని.. జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోందన్నారు. 24 గంటలు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేలా పని చేయాలనేది నా కోరిక. అర్థరాత్రి, అపరాత్రుళ్లు కూడా జనసేన అందుబాటులో ఉండేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు.

Read Also: MODI: మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ.. ఎప్పుడంటే?

ఇక, విద్యా, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, శాంతి భద్రతలపై ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతోందన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీ వెళ్లి వచ్చాక లెజిస్లేటీవ్ మీటింగ్ పెట్టుకుందాం. ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందన్నారు. అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లూ గెలిచాం. పోటీ చేసిన అన్నీ సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు. దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమే అన్నారు. పవన్‌కు అంత మెజార్టీ వస్తుంది.. ఇంత మెజార్టీ వస్తుందంటుంటే.. నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి.. ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.