Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ రోజు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లగిసుపల్లి హెలిపాడ్ నుంచి ఓనూరు ఓనర్ జంక్షన్ చేరుకున్నారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కాలి నడకన ఓనూరు గ్రామం చేరుకున్నారు. అనంతరం ఆయన ఓనురు స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి కొళాయిని పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్, కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు.
తర్వాత అక్కడి నుంచి ఓనూరు అంగన్వాడి సెంటర్‌కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి. గర్భిణీలకు పౌష్టికాహారం (కిట్స్ ), పంపిణీ చేశారు. అనంతరం ఓనూరు ఎంపీపీ స్కూల్ సందర్శించి, అక్కడి స్కూల్ పిల్లలతో ముచ్చటించారు. అనంరతం వారికి బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వ శిక్షణాఅభ్యాన్ అధికారి స్వామి నాయుడును స్కూల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ నందిగరువు చేరుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నంది గురువులో ప్రజలతో మాటామంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
