NTV Telugu Site icon

Google Search : ఇంటర్నేషనల్ లెవల్లో హవా చూపిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Google Search : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఒక్క సినిమాలో నటించకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన స్టామినా ఏంటో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చూపించాడు. మరి ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేకుండానే నార్త్ ఆడియెన్స్ లో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ వచ్చింది. మరి దీనితో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్లిందని అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇపుడు దీనికి మించిన కిక్ తో పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఈసారి పవన్ నేషనల్ లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు.

Read Also:Manchu Manoj: జల్‌పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన.. మద్దతు తెలిపిన మనోజ్

ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా జీవితంలో ఒక భాగంగా మారింది. సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాధారణ వార్తలు ఇలా అనేక రకాల వార్తలను చూసేందుకు టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్ల కంటే సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనం నిత్యం సోషల్ మీడియాలో ఎవరి కోసం వెతుకుతూ ఉంటాం. ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న వారి కోసం భారతదేశం అంతటా నెటిజన్లు వెతుకుతారు. ఇలా ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also:Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో.. మోహన్ బాబుపై కేసు నమోదు

సినిమా, రాజకీయ వర్గాలను కలిపి చూస్తే, గూగుల్ ట్రెండ్స్‌లో పవన్ కళ్యాణ్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అనే నినాదం దేశవ్యాప్తంగా వ్యాపించింది. రీసెంట్ గా ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎవరు..? ఆయన చరిత్ర తెలుసుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి అందరూ పవన్ కళ్యాణ్ అని కీవర్డ్ తో గూగుల్ లో సెర్చ్ చేశారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో గ్లోబల్ లెవెల్లో అత్యధికంగా వెతికిన ఇండియన్ సినీ నటుల జాబితాలో పవన్ కళ్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్ టాప్ 2 స్థానంలో నిలిచారు. దీనితో ఇపుడు పవన్ అంటే నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పుకోవాలి.

హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో, చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, నరేంద్ర మోడీ మూడో స్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం పవన్ తన భారీ సినిమా హరిహర వీరమల్లు లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క తను లేకుండా ఓజి షూట్ కూడా జరుగుతుంది.

Show comments