NTV Telugu Site icon

Pawan Kalyan in Vizag RK Beach: తొలిప్రేమ సీన్ రిపీట్.. ఒంటరిగా పవన్ బీచ్ లో వాకింగ్

Pawan

Pawan

Pawan Kalyan in Vizag RK Beach: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్… నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. ఈ క్రమంలోనే పవన్ విశాఖ ఆర్‎కే బీచ్‎కు వెళ్లారు. చాలా కాలం తర్వాత బీచ్ కు వెళ్లిన పవన్ కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చేశారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే కాసేపు అక్కడి మత్స్యకారులతో పవన్ ముట్టడించారు.

Read Also: Rahul Gandhi Bomboo Chicken : బొంగులో చికెన్ వండిన రాహుల్ గాంధీ.. టేస్ట్ సూపర్

ఈ సందర్భంగా పవన్ రిషికొండను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్… కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ రేకులతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారికేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల ఆవలి వైపు జరుగుతున్న పనులను పరిశీలించారు.