NTV Telugu Site icon

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‏కు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా?

Pawan Kalyan

Pawan Kalyan

టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

అయితే ఈ యాత్రలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్… ఇప్పుడు యువత ను, సినీ స్టార్స్ ను ఉద్దేశించి ప్రశంగించారు.. ప్రస్తుతం పవన్ కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. సినిమాల పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయిన ఇష్టపడడం లో తప్పులేదు.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఒక్కచోటి కి చేరాలన్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత అంతా ఒక్కటై ఆలోచించాలని అన్నారు. తన తోటి నటీనటులంటే తనకెంతో గౌరవం ఉందని.. వారి సినిమాలను కూడా చూస్తానని అన్నారు..

అంతేకాదు తనకు ఎన్టీఆర్, ప్రభాస్ అంటే చాలా ఇష్టమైన హీరోలని చెప్పాడు.. రామ్ చరణ్, చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్ల కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరలవుతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు లు ఉన్నాయి. అందులో ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు లు సెట్స్ పై ఉన్నాయి. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి… మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

Show comments