NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అయిదేళ్ల సంపాదనెంతో తెలుసా..?

Pvan

Pvan

Pawan Kalyan: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులు వారి ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడిస్తున్నారు. ఈ రోజు పీఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్‌ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్ లో భాగంగా ఆయన తన ఆదాయన్ని వెల్లడించారు. జనసేనాని అయిదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు కాగా.. ఆదాయ పన్ను కింద ప్రభుత్వానికి రూ.47,07,32,875 చెల్లించారు. జీఎస్టీ కింద రూ.28,84,70,000 చెల్లించారు.

READ MORE:Sundeep Kishan : రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ మూవీ ప్రారంభం.. పిక్స్ వైరల్..

పవన్ కళ్యాణ్ కు రూ.64,26,84,453 ల అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 తీసుకోగా.. వ్యక్తుల నుంచి రూ.46,70,000 పుచ్చుకున్నట్లు పత్రాల్లో పొందుపర్చారు. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు గాను రూ.17,15,00,000 విరాళాల రూపంలో అందించారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రయాశీలక క్యార్యక్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఈ నగదును వెచ్చించించారు. వివిధ విద్యాసంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందించారు. అందులో కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి, పీఎం సిటీజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, శ్రీ రామజన్మ భూమి తీర్థ ట్రస్టుకి రూ. 30,11,717, పవన్ కళ్యాణ్ లర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ కి రూ. 2 లక్షలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు.