Site icon NTV Telugu

Pawan Kalyan: వైద్య సేవలో నిర్లక్ష్యంగా ఉండకండి.. డిప్యూటీ సీఎం సిరీస్..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Gold Prices Drop: పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈ ఆకస్మిక పతనం ఏంటి?, 12 ఏళ్ల రికార్డు బ్రేక్!

ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన దొండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన ఘటనపై సమీక్ష నిర్వహించారు. ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని పవన్ స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.

పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహణ గురించి ఆరా తీశారు. ప్రసూతి మరణాలు సీరియస్ గా తీసుకోవలసిన అంశమనీ, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యుల బృందంతో సమగ్రంగా విచారణ చేసి కారణాలను నమోదు చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”

శ్రీదుర్గ ప్రసూతి మరణంపై, పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే జిల్లాలోని కొన్ని ఆసుపత్రులపై వైద్యులు, ఇతర సిబ్బంది తమ విశ్వాసాల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించి ప్రభుత్వ ఆసుపత్రులను వ్యక్తిగత విశ్వాసాల ప్రచారానికి వేదికలుగా చేయకూడదన్నారు. శ్రీదుర్గ మరణంపై డిప్యూటీ సీఎం పవన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Exit mobile version