NTV Telugu Site icon

Pawan Kalyan Bro Movie: ‘బ్రో ది అవతార్’ టిక్కెట్ రేటు పెంచనున్న ఏపీ సర్కార్?

Bro Movie

Bro Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏపీ లో దారుణంగా ఉంది.. అందరి హీరోలకు టిక్కెట్ రేటు పెంచిన కూడా పవన్ సినిమాలకు ఏపీ సర్కార్ వ్యతిరేకంగా నే వ్యవహారించింది.. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణం గా టికెట్ రేట్స్ దొరకక, గత రెండు పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ స్థాయి లో నష్టాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎన్ని నష్టాలు వచ్చినా పవన్ ఫ్యాన్స్ ను నిరాశ పరచ్చలేదు.. వరుస సినిమాలు చేసుకుంటూనే వస్తున్నాడు.. మిగిలిన హీరోల సినిమాలు 200 రూపాయిల టికెట్ రేట్స్ తో నడిస్తే, పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం వంద రూపాయిల టికెట్ రేట్స్ తో నడిచేవి. అందువల్ల మిగిలిన ప్రాంతాలలో బాగా లాభాలు వచ్చినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో నష్టాలు చవిచూసారు..

అభిమానులు ఇక మన సినిమాలకు ఇంతే వసూళ్లు వస్తాయి, ప్రభుత్వం మారేవరకు ఆంధ్ర ప్రదేశ్ మార్కెట్ ని మర్చిపోవాల్సిందే అని అందరూ అనుకున్నారు, కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి నిర్మాతలు టికెట్ రేట్స్ అప్లై చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అందుకే సంబందించిన పత్రాలను కూడా సిద్ధం చేసినట్లు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టికెట్ రేట్స్ మీద అదనంగా 25 రూపాయిలు కోరబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా భారీ రేట్స్ కి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఇది రికవర్ అవ్వాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్. మరి జగన్ సర్కార్ అనుమతిని ఇస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్ని కూడా జనాలకు తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి..పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చాలా కాలం తర్వాత చూసినట్టుగా అనిపించిందని, కచ్చితంగా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారని అంటున్నారు.. మరి చూడాలి కలెక్షన్ కు ఎలా ఉంటాయో..

Show comments