NTV Telugu Site icon

Physical Harassment: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు లైంగికదాడి.. కేకలు వేయడంతో..!

Physical Harassment

Physical Harassment

Physical Harassment: చిన్నారులు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వలోనూ నర్సుపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ట్రైనీ నర్సుపై లైంగికయత్నానికి పాల్పడ్డాడు ఓ రోగి సహాయకుడిగా ఉన్న వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలానికి చెందిన గోపి.. అనారోగ్యంపాలైన తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు.. ఇక, వారం రోజులుగా ఆసుపత్రిలోనే తన తల్లికి సహాయకుడిగా ఉంటున్నాడు గోపి..

Read Also: Rabinhood : నితిన్ ‘రాబిన్ హుడ్ ‘ రిలీజ్ డేట్ అనౌన్స్..కరెక్ట్ టైంకి దిగుతున్నాడే..

అయితే, మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ నర్సుపై కన్నేశాడు గోపి.. ఆమె నీళ్లు తాగేందుకు వెళ్లగా.. ఆమె వెనుక నుంచి నెమ్మదిగా వెళ్లి.. ఆ గది తలుపులు మూశాడు.. ట్రైనీ నర్సుపై బలవంతంగా లైంగిక దాడికి యత్నించాడు.. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న నర్సు.. గట్టిగా కేకలు వేసింది.. నర్సు కేకలు విని అప్రమత్తమైన తోటి సిబ్బంది.. తలుపులు బాధడంతో.. వారిని నెట్టుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశాడు గోపి.. అదే సమయంలో ఆపరేషన్ గది అద్దాలు పగలగొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.. ఇక, గోపిని అదుపులోకి తీసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు.. గాయపడిన గోపికి మొదట వైద్య సిబ్బందిచే చికిత్స అందించారు.. అనంతరం గోపీని పోలీసులకు అప్పజెప్పారు.. నర్సుపై అఘాయిత్యానికి పాల్పడిన గోపి.. మద్యం మత్తులో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.. పట్టుబడిన గోపి.. మా అమ్మకు బాగోలేక ఆస్పత్రికి వచ్చాం.. నన్ను క్షమించండి.. వదిలేయండి అంటూ.. సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్న వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది.

Show comments