Patancheru MLA Gudem Mahipal Reddy’s Brother: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇల్లిగల్ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలోకి అతడ్ని తీసుకోనున్నారు. ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేయనున్నారు.
Read Also: Mylavaram: మారిన మైలవరం వైసీపీ పరిశీలకుడు.. కారణం అదేనా..?
అయితే, అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డికి చెందిన ‘సంతోష్ సాండ్ మైనింగ్’ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేయడంతో పాటు లీజ్ అగ్రిమెంట్ ముగిసిన రెన్యువల్ చేయించలేదని కలెక్టర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్పెషల్ టాస్కో ఫోర్స్’ తెలిపింది. ఇక, కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం పటాన్ చెరు పరిధిలోని లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాలలో ఐదు మైనింగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి గత నెల 22న వాటిని అప్పటి ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీజ్ చేయగా.. అందులో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీ కూడా ఉన్నది. దీనిపై పటాన్ చెరు తహసీల్దార్ రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం ( మార్చ్ 15వ తేదీన) నాడు ఉదయం పోలీసులు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని వీరంగం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసుల వెహికిల్స్ పై రాళ్లు కూడా రువ్వారు.